Sunday, 26 April 2026 06:36:38 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

అసోసియేషన్ లోగో,ఆవిష్కరించి, ఐడీ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

Date : 30 November 2025 04:15 PM Views : 164

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు :రాజస్థాన్ వాసి, రతన్ హృదయాన్ని తాకిన ఇంటూరి పాలనదక్షత.. కార్యక్రమంలో కందుకూ రు మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ బాధ్యులు, రాజస్థాన్ నివాసి, రతన్ సైతము ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభివృద్ధి., సంక్షేమ కార్యక్రమాలను చూచి, పరవశం చెంది,ఇలాంటి ప్రజా రంజక నేతను నేనెప్పుడూ చూడలేదని, ఒకంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేయడం, కార్యక్రమంలో హైలైట్ గా నిలిచింది.* *మీ పాలన అద్భుతంగా ఉందని, రతన్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి కృతజ్ఞతాపూర్వకంగా పాదాభివందనం చేశారు*రాజస్థానీ సాంప్రదాయ వస్త్రాలను ధరించి, కార్యక్రమానికి హాజరైన రతన్., ఇంటూరి నాగేశ్వరరావు కార్యదక్షతకు ముగ్ధుడై ,ఎమ్మెల్యే ని పొగడ్తల వర్షంలో ముంచెత్తారు*రాష్ట్రాల సరిహద్దులను దాటి ఎమ్మెల్యే ఇంటూరి ప్రజా రంజక పాలన కొనసాగుతుందని, సభకు హాజరైన సెల్ ఫోన్ టెక్నీషియన్లు రతన్ వ్యాఖ్యలను విని చర్చించుకోవడం అక్కడ పరిపాటిగా మారింది.కందుకూరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం వెంగమాంబ ఫంక్షన్ హాల్ లో కందుకూరు మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ లోగో, ఆవిష్కరణ.,ఐడి, కార్డుల పంపిణీ కార్యక్రమం అసోసియేషన్ ఉపాధ్యక్షులు షేక్ సలాం నేతృత్వంలో, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మొబైల్ టెక్నీషియన్సు ఆమోదయోగ్యమైన ధరలతో, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. మొబైల్ రంగంలో నేడు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఫోర్ జి నుంచి ఫైవ్ జి టెన్ జి వరకు మొబైల్ సేవలు విస్తృతం కానున్నాయన్నారు . నేటి ఆధునిక ప్రపంచంలో మొబైల్ రంగం పాత్ర కీలకమని ఆయన తెలిపారు. కందుకూరు మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామం అన్నారు. కందుకూరులో రూముల అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, నెల్లూరు తరహాలో స్ట్రీట్ బజార్ పెట్టి తక్కువ కిరాయికి రూములు అందించే ఆలోచన తనకుందని తెలిపారు.తనను తమ స్వంత సోదరునిగా భావించి గెలిపించిన కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరికి ఇబ్బంది కలిగించే ధోరణి తనది కాదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు .పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఆటోనగర్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వివరించారు.ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో తాను అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. మొబైల్ టెక్నీషియన్లు మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. అసోసియేషన్, పార్టీలకు అతీతంగా పనిచేయాలని, అసోసియేషన్ లో ఉన్న బాధ్యులు బిపిఎల్ కు దిగువన ఉన్నట్లయితే వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై శివ నాగరాజు మాట్లాడుతూ, మొబైల్ టెక్నీషియన్లు వినియోగదారుల పట్ల మంచి స్నేహ పూర్వక వాతావరణంలో, సేవాభావంతో, వ్యవహరించాలన్నారు. తమ దుకాణాలు ముందు ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో కందుకూరు మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు షేక్ సలాం మాట్లాడుతూ, కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపడానికి నిరంతరం కృషి చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎంటిఏ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ,ఎంటిఎ కందుకూరు అధ్యక్షులు రియాజ్, సెల్ వరల్డ్ బాద్యులు శ్రీకాంత్, పలువురు మొబైల్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొని ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి. ఆయనపై ప్రేమతో పూల వర్షం కురిపించారు .అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మొబైల్ టెక్నీషియన్లకు ఐడి కార్డులను, టీ షర్టులను పంపిణీ చేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: