Sunday, 26 April 2026 08:19:29 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటా ఇంటూరి నాగేశ్వరరావు

Date : 28 April 2024 09:22 PM Views : 742

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు, అమరావతి జ్యోతి: రాబోయే తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని... దానివల్ల స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని కందుకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి *ఇంటూరి నాగేశ్వరరావు* అన్నారు. గుడ్లూరు మండలంలోని మోచర్ల, తెట్టు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించగా... ముందుగా తమ గ్రామానికి వచ్చిన నాగేశ్వరరావును గుర్రంపై ఊరేగిస్తూ తెట్టు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక సుల్తాన్ బీబీ దర్గాలో ఆయన దువా చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మోచర్ల గ్రామంలోనూ ఇంటింటి ప్రచారం చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏషియన్ పేపర్ పరిశ్రమ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని తరిమివేసారని విమర్శించారు. పరిశ్రమ ఏర్పాటై ఉంటే ఈపాటికి కొన్ని వేలమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించేవని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెట్టు గ్రామంలో అధికంగా ఉండే ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో వైసీపీ నేతలు చెరువుల్లో గ్రావెల్, వాగుల్లో ఇసుకను ఇష్టం వచ్చినట్లు తవ్వుకొని జేబులు నింపుకున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. కేవలం బటన్లు నొక్కి, అదే గొప్ప అభివృద్ధి అని ప్రచారం చేసుకుంటే సరిపోదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా అభివృద్ధి కూడా చేయాలని, జగన్ రెడ్డి ఆ విషయాన్ని మరిచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని నాగేశ్వరరావు అన్నారు. మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచిపేరు తెచ్చుకున్నారని నాగేశ్వరరావు అన్నారు. అలాంటి వ్యక్తి మన ఎంపీ అభ్యర్థిగా రావడం అదృష్టమని, ఆయనతోపాటు తనకు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాగేశ్వరరావు అభ్యర్థించారు. ఈ సందర్భంగా తెట్టు గ్రామానికి చెందిన షేక్ గౌస్, బుడేసాహెబ్, కత్తుల నరసింహం తదితరులు నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మద్దసాని శ్రీను, పార్టీ నాయకులు షేక్ పెదబాబు, షేక్ బాబు, బుజ్జి, సున్నా, మజహర్, సుభాని, యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, కాలేషా, సుల్తాన్ బాష, షరీఫ్, సహిద్, దారా వెంకట్రావు, మద్దసాని వెంకటేశ్వర్లు, తలకాయల శేషయ్య, నేలకూరి కొండయ్య, లేళ్లపల్లి కొండయ్య కుందుర్తి పోతురాజు, నారాయణ, మర్రిబోయిన వెంకటేశ్వర్లు, గొత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :