Amaravathi Jyothi - Telagana / Hyderabad : అంగన్వాడీలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ హైదరాబాద్, అమరావతి జ్యోతి: తెలంగాణ: మంత్రి సీతక్క అంగన్వాడీ ఉద్యోగులకు గుడన్యూస్ చెప్పారు. 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్ వాడీలుగా అప్ గ్రేడ్కు సంబంధించిన ఫైల్పై మంత్రిగా తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.7500 జీతం పొందుతున్న మినీ అంగన్ వాడీ టీచర్లు ఇకపై రూ.13,500 పొందుతారని, ప్రతి కేంద్రానికి ఒకరు చొప్పున హెల్పర్స్ను నియమించుకోవచ్చని తెలిపారు.
Admin
Amaravathi Jyothi