Friday, 19 June 2026 03:36:48 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

టొరంటో లో ఘనంగా సంక్రాంతి పండుగ వేడుకలు

Date : 30 January 2024 02:34 AM Views : 819

Amaravathi Jyothi - National / : తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటోలో సంక్రాంతి పండుగ వైభవంగా ఘన వేడుకలు కెనడా,అమరావతి జ్యోతి: తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు తీన్మార్ సంక్రాంతిగా చింగ్కూజీ సెకండరీ స్కూల్, బ్రాంటెన్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 800 కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించగా, మేఘన గుర్రాల, శైలజ ఎర్ర, స్ఫూర్తి కొప్పు, కుమారి ప్రహళిక మ్యాకల మరియు శ్రీరంజని కందూరి జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీరామదాసు అర్గుల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతముగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ మరియు షో అండ్ టెల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రాహుల్ బలనేని మరియు జ్యోతి రాచ మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా ప్రవీణ్ నీల , ఝాన్సీలక్ష్మి గరిమెళ్ళ, గుప్తేశ్వరి వాసుపిల్లి మరియు మనస్విని వెలపాటి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే టి సి ఏ స్పాన్సర్ డాక్టర్ సౌజన్య కాసుల మరియు యేసు బాబుచే 2024 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. శ్రీనివాస్ మన్నెం ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి మరియు కుమారి ప్రహళిక మ్యాకల నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని మరియు డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, భగీరథ దాస్ అర్గుల, ప్రవీణ్ కుమార్ సామల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ నవీన్ ఆకుల మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, కలీముద్దీన్ మొహమ్మద్, ప్రకాష్ చిట్యాల, అఖిలేష్ బెజ్జంకి, హరి రావుల్, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనముగా ముగించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: